సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి సందడి చేయబోతోంది. పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా నటించనుండడం విశేషం. మహేష్ బాబుని పవర్ ఫుల్ గా చూపిస్తూనే.. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ని కూడా అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నాడు. 

ఇటీవల విడుదలైన టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు మ్యానరిజమ్స్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ బావుండడంతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రికార్డులు  బద్దలు కావడం ఖాయం అని మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

టీజర్ విడుదలైపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీపై పడింది. దేవిశ్రీ ఫామ్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. దేవిశ్రీ తన సత్తామేరకు మంచి ఆల్బమ్ అందించి చాలా రోజులు అవుతోంది. దీనితో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఎలాంటి పాటలు అందించాడు అనే ఉత్కంఠ నెలకొంది. త్వరలో చిత్ర యూనిట్ పాటల సందడిని ప్రారంభించబోతోంది. 

వరుణ్ తేజ్ కి హ్యాండిచ్చిన రాంచరణ్ హీరోయిన్.. పూరి హీరోయిన్లకు ఛాన్స్!

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. మహేష్ కు జోడిగా తొలిసారి రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న మూవీ ఇది. విజయశాంతి ఈ చిత్రంలో ప్రొఫెసర్ గా కీలక పాత్రలో నటించారు. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.