'క్షణం', ' గూఢచారి' వంటి చిత్రాల ద్వారా హీరోగా తన టాలెంట్ నిరూపించుకున్న అడివి శేష్.. తాజాగా 'ఎవరు' అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. రామ్ జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రెజీనా సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ని బట్టి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. ట్రైలర్ లో రెజీనాను ఎవరో బలవంతంగా రేప్ చేసే ప్రయత్నం చేస్తే.. ఆమె దాన్ని ప్రతిఘటించి తుపాకీతో కాలుస్తుంది.

ఈ హత్య కేసుకి సంబంధించిన విచారణను పూర్తి చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తాడు. లంచగొండి అయిన అడివి శేష్ ఈ కేసు ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అసలు రెజీనా నిజంగానే ఓ వ్యక్తిని చంపిందా..? ఆమె చంపడానికి నిజమైన కారణం ఏంటి..? అడివి శేష్ తను కరెప్ట్ అంటూ నటిస్తున్నాడా..? లేక నిజంగానే లంచగొండా..? ఇలా అన్ని విషయాలను సస్పెన్స్ గా ఉంచారు.

ట్రైలర్ లో ఒకటి రెండు సీన్లలో నవీన్ చంద్ర కనిపించారు. ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేయడంతో సినిమాపై ఇంటరెస్ట్ పెరిగిపోయింది. ఆగస్ట్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు!