రంగస్థలం మూవీలో ఆది రోల్ చాలావరకూ సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో సాగుతుంది కానీ.. కొన్ని సన్నివేశాలు మాత్రం జనాలను సీట్లో కూర్చోనివ్వవు. ముఖ్యంగా శత్రువులు ఆదిపై దాడి చేసి చంపేసేందుకు ప్రయత్నించే సీన్ లోను.. కుమార్ బాబు పాత్ర చనిపోయే సన్నివేశంలోనూ ఆది పినిశెట్టి నటనను ఎంతగా పొగిడినా తక్కువే. అయితే.. సెట్ లోనో..       లొకేషన్ లోనో ఆ సీన్ చేయడం వేరు. ఆ సీన్ అంతగా పండాలంటే.. డబ్బింగ్ ఇంకా ముఖ్యం. పైగా ఆ సన్నివేశాల్లో ఎక్కడా ఆదికి ఫీలింగ్స్ తప్ప.. అసలు డైలాగులే అంతగా ఉండవు.

ఆ సన్నివేశాలకు సంబంధించి.. ఆది డబ్బింగ్ చెబుతున్న సీన్స్.. ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. అప్పుడు తాను నటించిన పాత్రను చూసుకుంటూ.. అదే ఎమోషన్ ను మళ్లీ క్యారీ చేస్తూ.. చిట్టి చిట్టి అంటూ ఒక్క మాటతోనే.. ఆ సీన్ లోని ఎమోషన్ ను ఆది డబ్బింగ్ రూపంలో ఎక్స్ ప్రెస్ చేస్తున్న తీరు అద్భుతం అనాల్సిందే.