తన కెరీర్ లో ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో నటించిన హీరోయిన్ అదా శర్మ ఇప్పుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. అదే 'మ్యాన్ టు మ్యాన్' సినిమా. ఈ సినిమాలో అదా ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపంచబోతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.

వివరాల్లోకి వెళితే.. లింగమార్పిడి కాన్సెప్ట్ తో దర్శకుడు అబీర్ సేన్ గుప్తా 'మ్యాన్ టు మ్యాన్' సినిమా తీయబోతున్నాడు. ఇందులో పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ విషయం తెలియక హీరో అదాని పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లైన తరువాత విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. లింగమార్పిడిపై సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి ఆపరేషన్ ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొంటున్న  ఇబ్బందులను ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ వేలో చూపిస్తూ అంతర్లీనంగా ఓ మెసేజ్ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమాపై అదా చాలా ఆశలు పెట్టుకొంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చాలానే వచ్చాయి. వాటికి చక్కటి ప్రేక్షకాదరణ దక్కింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి!