కోలీవుడ్‌ నటి, ఒకప్పటి హీరోయిన్‌ వనిత విజయ్‌ కుమార్ ఇటీవల మూడె వివాహం చేసుకున్న సంగతి తెలసిందే. పీటర్‌ పాల్‌ను వివాహం చేసుకున్న ఆమెపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా వనిత మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నటి, డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి, నిర్మాత రవీంద్రన్‌లు వనితపై విమర్శలు చేసిన వారిలో ఉన్నారు.

అయితే ఈ విమర్శలపై వనిత ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ట్విటర్ వేదిక తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చింది. అయితే వనిత సమాధానమిచ్చినా విమర్శలు ఆగకపోవటంతో చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యింది వనిత విజయ్‌ కుమార్‌. తాజాగా తనపై విమర్శలు చేసేవారిపై పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తన లాయర్‌తో కలిసి పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాత రవీంద్రన్‌తో పాటు సూర్యదేవి పైన ఫిర్యాదు చేసింది.

సూర్యదేవి అనే మహిళ వనిత మూడో పెళ్లి చేసుకోవటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వనిత.. `కొన్ని వారాలుగా మీడియాలో నా గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. సూర్య దేవి అనే మహిళ అనుచిత వ్యాఖ్యలు చేసింది. నిర్మాత రవీంద్రన్ కూడా నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి` అని తెలిపింది. అందుకే కేసు నమోదు చేసినట్టుగా తెలిపింది.