ప్రస్తుతం అన్ని చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరగడం ఎక్కువయ్యాయి. కనీసం లైంగిక వేధింపులపై అవగాహన లేని చిన్నారులపై కూడా ఇటువంటి దాడులు ఎక్కువవుతున్నాయి.

ఈ క్రమంలో అవగాహన కోసం కొందరు మహిళా సోషల్ యాక్టివిస్ట్ లు సెక్సువల్ అంశాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మన సమాజంలో ఇటువంటి విషయాలను ప్రోత్సహించేవారు తక్కువ. మహిళలు ఇటువంటి అంశాల గురించి మాట్లాడడాన్ని తప్పు పడుతుంటారు. 

తాజాగా తమన్నా కూడా స్త్రీ లైంగిక స్వేచ్చ అనే అంశంపై సమాజాన్ని ప్రశ్నించింది. మహిళల లైంగిక పరమైన అంశాల గురించి మాట్లాడితే తప్పేంటి..? అని ప్రశ్నిస్తోంది మిల్కీ బ్యూటీ. ''సమాజంలో ఆడవాళ్లు సెక్స్ గురించి మాట్లడితే అందుకే తప్పేముంది. అలా మాట్లాడే వారిని ఎందుకు తప్పుపడతారు. లైంగికపరమైన అంశాల గురించి మాట్లాడడంలో 
తప్పులేదు.

ఈ విషయంలో ఆడవాళ్లను ఎందుకు ప్రోత్సహించరు..? మన సమాజంలో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన విధానాన్ని బట్టి, వారు ధరించే లో దుస్తులను బట్టి అంచనా వేయడం ఏంటని'' ప్రశ్నిస్తోంది. తమన్నా ఈ విధమైన కామెంట్స్ చేయడంతో పెళ్లి కాని నీకు ఈ విషయాలతో పనేంటి అంటూ విమర్శిస్తున్నారు.