యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన స్వాతి ఆ తరువాత నటిగా మారి ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఆమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇటీవల వికాస్ అనే పైలట్ ని పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ.

పెళ్లైన తరువాత ఈ బ్యూటీ కాస్త బోల్డ్ గా తయారైందనే చెప్పాలి. గతంలో తనపై వచ్చిన ఓ సెక్స్ వీడియో టేపు గురించి అలానే సినిమాల్లో రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. ''నేను కలర్స్ చేస్తున్నప్పుడు ఓ ఎంఎంఎస్ వచ్చింది.

అందులో సెక్స్ చేస్తున్న అమ్మాయికి కూడా పన్నుపై పన్ను ఉంది. దీంతో అందులో ఉన్నది నేనే అనుకున్నారంతా.. సెట్స్ లో ఒకటే గుసగుసలు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఇప్పటికీ క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేను'' అంటూ స్పష్టం చేసింది.

ప్రస్తుతం సినిమాలు ఆపేసిన స్వాతి త్వరలోనే రీఎంట్రీ ఇస్తానని అంటోంది. కొన్నాళ్లపాటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసి ఓ మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది.