శృంగార తారగా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా.. తన సినిమాలతో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేది. తనకు నమ్మకద్రోహం జరగడంతో జీరో పొజిషన్ కి వచ్చేసింది. తాను నమ్మకద్రోహానికి గురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఎదురుతిరిగి నిలబడతానని అంటోంది షకీలా.

తాజాగా ఆమె నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించింది. తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తానంటోంది షకీలా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై జనాలకు ఉన్న సందేహాలు తీర్చే క్రమంలో కొన్ని సమాధానాలు చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెని ప్రశ్నించగా.. తను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపు ఎదురుకాలేదని.. కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి ఇబ్బంది పడలేదని చెబుతూ.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను. నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగా అంటూ శ్రీరెడ్డికి పంచ్ వేసింది.

అయితే గతంలో ఇదే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం ఓ నిర్మాత తనను షూటింగ్ అయిపోయిన తరువాత వస్తావా..? అని అడిగాడని.. అతడి పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.