ఒకప్పుడు షకీలాతో సమానంగా మలయాళ చిత్రపరిశ్రమలో శృంగార చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది నటి రేష్మ. ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమై పదేళ్లకు పైగా దాటింది. తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్లు దక్కించుకొని కొంతకాలం పాటు గడిపింది.

శృంగార చిత్రాల్లో నటించడానికి ఒక్కో సినిమాకు రూ.5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది ఈ తార. అయితే 2007 లో సెక్స్ రాకెట్ లో చిక్కుకున్న రేష్మ ఆ తరువాత బెయిల్ పై విడుదలైంది. అనంతరం ఆమె కనిపించడం మానేసింది.

సడెన్ గా ఆమె కనిపించకపోవడంతో మాలీవుడ్ లో ఆమె చనిపోయిందంటూ పుకార్లు వినిపించడం మొదలుపెట్టాయి. ఆమె చనిపోయిందని కొందరు అంటుంటే, మరికొందరు ఆమె విదేశాల్లో స్థిర పడిందని వాదిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన నటి షకీలా.. రేష్మ పెళ్లి చేసుకొని మైసూరులో సెటిల్ అయిందని, ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఆమె ఎంతో సంతోషంగా ఉందని, ఆమె చనిపోయిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.