Asianet News TeluguAsianet News Telugu

తన బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సమంత

లాక్‌ డౌన్‌ సమయంలో గార్డెనింగ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సామ్‌, తరువాత భర్త చైతో కలిసి బయటకు వెళ్లొచ్చిన విషయాలను కూడా షేర్  చేసుకుంది. ఇటీవల యోగా ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సరికొత్త చాలెంజ్‌ విసిరిన ఈ బ్యూటీ తాజాగా తన స్కిన్‌ టోన్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది.

Actress Samantha Reveals Her Glowing Skin Secret
Author
Hyderabad, First Published Jul 11, 2020, 2:43 PM IST

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో అభిమానలకు సెలబ్రిటీలకు మధ్య గ్యాప్ వచ్చింది. సినిమాల షూటింగ్‌లు రిలీజ్‌లు, ప్రమోషన్లు లేకపోవటంతో తారలు బయటకు రావటం లేదు. దీంతో వాళ్లు కనిపించటమే గగనమైంది. ఈ పరిస్థితుల్లోనూ అభిమానులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తోంది సమంత. తాను లాక్‌ డౌన్‌ టైం ను ఎలా స్పెండ్ చేస్తుందో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది సమంత.

లాక్‌ డౌన్‌ సమయంలో గార్డెనింగ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సామ్‌, తరువాత భర్త చైతో కలిసి బయటకు వెళ్లొచ్చిన విషయాలను కూడా షేర్  చేసుకుంది. ఇటీవల యోగా ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సరికొత్త చాలెంజ్‌ విసిరిన ఈ బ్యూటీ తాజాగా తన స్కిన్‌ టోన్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది. తాను స్కిన్‌ థెరపీ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేసింది సమంత.

ఆ వీడియోతో పాటు విటమిన్‌ ఇన్‌ఫ్యూషన్ థెరపీతో స్కిన్‌ గ్లో వస్తుందని తెలిపింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే తెలుగులో చివరగా `ఓ బేబీ` సినిమాలో నటించింది. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో నటించింది. త్వరలో నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I noticed that I could be talking about cooking, gardening... but to some of you it’s blah blah now tell us how you get that glowy skin ... 🤓... okay here goes .. firstly I love my glowy skin although i sometimes get asked if I need a tissue to wipe the sweat of my face 🤨🥺... Dermafrac 🥰 Vitamin infusion therapy ...infusing tons of goodness into your skin .. helps with fine lines , pigmentation, open pores and congested skin and dry patches and what all of you want to hear ... gives you the glow 🤩 Okay now to the good part ... so I do this once a month or once in two months and I did not want to share unless I can help in some way .. so I worked out something with the good people of @ambrosia_clinic to give you a 25% discount if you use the code 'SAMANTHA’ .. let’s GLOW together 🌞 #notanad #justforyou

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Jul 10, 2020 at 3:22am PDT

Follow Us:
Download App:
  • android
  • ios