ఇటీవల కాలంలో సినీ తారల ప్రేమలు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు, విడాకుల వార్తలు చాలా కామన్‌ అయిపోయాయి. హాలీవుడ్‌ లో ఈ వార్తలు మరింత కామన్‌గా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హాలీవుడ్‌ కథానాయకులు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవటం కూడా మనం చాలా సార్లు వింటుంటాం. అయితే అన్ని రికార్డ్‌లను బ్రేక్‌ చేస్తూ ఓ హాట్ బ్యూటీ ఏకంగా ఆరో పెళ్లికి రెడీ అవుతోందన్న వార్తలు ఇప్పుడు గ్లామర్‌ ఫీల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ బ్యూటీ పమేలా ఆండ్రసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గత బంధాలతో పాటు భవిష్యత్తులో తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వివరించింది పమేలా. మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు అవును కనీసం ఇంకా ఒక్కసారైనా పెళ్లి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..? అంటూ సరదాగా కామెంట్ చేసింది.

అంతేకాదు తాను ఐదు పెళ్లి చేసుకున్నట్టుగా అంతా భావిస్తారు కానీ నేను చేసుకుంది కేవలం మూడు పెళ్లిళ్లే అంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేసింది. 1995లో టామీ లీని వివాహం చేసుకున్న పమేలా 98లో అతని నుంచి విడిపోయింది. తరువాత 2006లో కిడ్‌ రాక్‌ను వివాహం చేసుకుంది. ఒక్క ఏడాదిలోనే ఈ బంధం కూడా తెగిపోయింది. అదే ఏడాది రిక్‌ సాలోమన్‌ను పెళ్లి చేసుకొని వెంటనే విడిపోయింది. తరువాత మరోసారి రిక్‌ నే 2014లో వివాహం చేసుకుంది. కానీ మరోసారి అతడితో పొసగక 2015లో విడిపోయింది.

ఇటీవల జాన్‌ పీటర్స్‌ ను పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వినిపించినా తాను వివాహం చేసుకోలేదని కేవలం కొంత కాలం సహజీవనం మాత్రమే చేశామని ఈ జంట క్లారిటీ ఇస్తుంది. దీంతో మొత్తంగా ఐదు సార్లు రిలేషన్‌ షిప్‌ కు బ్రేక్‌ అప్‌ చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది.