సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసుపై సీబీఐ విచారణ జరుగుతుండగా కొన్ని కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. సుశాంత్ డ్రగ్స్ తీసుకొనే వారని ఆయన సిబ్బంది చెప్పడంతో పాటు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి కొందరు డ్రగ్ డీలర్స్ తో కమ్యూనికేషన్ నడిపినట్లు ఆధారాలు దొరికాయి. ఇదే విషయమైన హీరోయిన్ కంగనా రనౌత్ కొన్ని కీలక ఆరోపణలు చేయడం జరిగింది. బాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలు, హీరోయిన్స్ మరియు ప్రముఖులు పార్టీలలో డ్రగ్స్ వాడతారని తీవ్ర ఆరోపణలు చేసింది. 

అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా డ్రగ్ కల్చర్ ఉందని ఓ జర్నలిస్ట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయని ఆ జర్నలిస్ట్ చెప్పడం చాలా మంది ప్రముఖులను భయాందోళనకు గురి చేస్తుంది.  హీరోయిన్ మాధవిలత టాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై నోరువిప్పారు. పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పార్టీలలో డ్రగ్స్ వాడతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో మాదిరి టాలీవుడ్ లో కూడా డ్రగ్ కల్చర్ ఉందని , దీనిపై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు

ఈ ఆరోపణలకు ఎక్సైజ్ శాఖ స్పందించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు, ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానితులపై కన్నేసి ఉంచాం అన్నారు. మాధవీలత డ్రగ్ ఆరోపణలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే

తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాగా ఫేమస్ అయిన మాధవి లత ఈ మధ్య రాజకీయాలలో కూడా జాయిన్ అయ్యారు. ఆమె బీజెపీ పార్టీలో చేరడం జరిగింది. 2007లో వచ్చిన అతిథి చిత్రంతో వెండితెరకు పరిచమైన మాధవిలత , నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారింది. నానికి జంటగా మాధవిలత నటించిన స్నేహితుడు మూవీ కూడా హిట్ అందుకుంది. 2015 తరువాత మాధవి వెండితెరపై కనిపించలేదు.