హైదరాబాద్: ఓ సినీ నటి వ్యభిచారం చేస్తూ హైదరాబాదు స్టార్ హోటల్లో పట్టుబడింది. ఆమెను భోజ్ పురి నటిగా గుర్తించారు. ఆమెతో పాటు ఓ ప్రభుత్వోద్యోగి పట్టుబడ్డాడు. సంపన్నులను లక్ష్యం చేసుకుని అంబుల జనార్దన్ రావు అలియాస్ జానీ అనే వ్యక్తి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. 

సినీ తారలను ముంబై నుంచి రప్పించి స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాటు చేసి అతను వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విటుల నుంచి రోజుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల రూపాయల వరకు అతను వసూలు చేస్తాడు. 

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన అంబుల జనార్దన్‌రావు అలియాస్‌ జానీ. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ముంబైకి చెందిన భోజ్‌పురి నటితో జానీ వ్యభిచారం చేయిస్తున్నాడని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది.

దాంతో శనివారం ఆ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు సినీ నటితో పాటు, జనార్దన్‌రావు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 40 వేల నగదు, 3 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
 
హైదరాబాదులోని పద్మరావునగర్‌లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఆ నటిని ఇక్కడికి రప్పించినట్లు తెలిసింది. విటుడిని అమిత్‌ మహేంద్ర శర్మగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వోద్యోగి అయిన అతని నుంచి జనార్దన్ రావు రూ.20 వేలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది.