చిత్ర పరిశ్రమలో విషాదాల పరంపర కొనసాగుతుంది. కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర మరణాన్ని మరువక ముందే మరో యువ నటి అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. పలు బాలీవుడ్ చిత్రాలలో నటించిన బెంగాలీ నటి ఆర్య బెనర్జీ తన నివాసంలో శవంగా కనిపించరు. ఆమె ఇంటి నుండి బయటికి రాకపోవడాన్ని గమనించిన పొరుగింటివారు, పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. 
 
ఆర్య ఇంటి తలుపు బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులు నిర్జీవంగా పడివున్న శవాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఆర్య  గదిలో ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారని సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె మరణం వెనుక కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
 
2010లో విడుదలైన లవ్  సెక్స్ అవర్ ధోకా మూవీలో ఆర్యా బెనర్జీ నటించారు. విద్యా బాలన్ హీరోయిన్ గా తెరకెక్కిన డర్టీ పిక్చర్ మూవీలో ఆర్యా బెనర్జీ కీలక రోల్ చేయగా గుర్తింపు పొందారు. సిల్క్ స్మిత బయోపిక్ గా డర్టీ పిక్చర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆర్యా బెనర్జీ మృతి వార్త తెలుసుకున్న పరిశ్రమ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యా తండ్రి ప్రముఖ సితారిస్ట్ నిఖిల్ బందోపాధ్యా కావడం విశేషం.