రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారు.

గతంలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కోడలు సమంతకు సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన సమంత.. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం సామ్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్  చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని కోరారు. ఒక్కొక్కరు కనీసం మూడు మొక్కలు నాటాలని తన అభిమానులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహనటులు కీర్తి సురేశ్, రష్మికకు సమంత ఛాలెంజ్ విసిరారు. 

"