టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సడెన్‌గా స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఆయనికి అత్యవసర  చికిత్స అందించారు.  బిపి డౌన్ అవడంతో హార్ట్ఎటాక్ వచ్చింది. దాంతో  శివాజీ రాజాకు విజయవంతంగా స్టెంట్ వేశారు వైద్యులు. 

గురువారం ఆయనకు హార్ట్‌ వాల్వ్‌కు స్టెంట్ వేశారు వైద్యులు. మరి కొన్ని రోజులుపాటు వైద్యుల పర్య వేక్షణలో ఉంటూ, పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ అక్కడ పండిన కూరగాయలు సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నారు శివాజీ రాజా. 

అయితే ఉన్నట్లుండి శివాజీ రాజు కు గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. దాదాపు ముప్పై  ఏళ్లకు పైగా నటుడిగా కొనసాగుతున్న శివాజీ రాజా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలు, సీరియల్స్ , షోలు ఎన్నో చేసారు. ఆయనకు మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరుంది. శివాజీ రాజాకు గుండెపోటు వచ్చిందన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, మా అసోసియేషన్ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను ఫోన్లలో పరామర్శిస్తున్నారు.