Asianet News TeluguAsianet News Telugu

`ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` సక్సెస్‌ `పోలీస్‌స్టోరీ`ని గుర్తు చేసిందిః సాయికుమార్‌ ఎమోషనల్‌

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌. శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రమోద్‌, రాజు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. 

actor sai kumar emotional on kiran abbavarama starrer s r kalyanamandapam successmeet
Author
Hyderabad, First Published Aug 8, 2021, 8:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

`కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` చిత్రం 25ఏళ్ల క్రితం వచ్చిన తన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం `పోలీస్‌ స్టోరీ`ని గుర్తుచేసిందని ఎమోషనల్‌ అయ్యారు నటుడు సాయికుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `SR కళ్యాణమండపం – Est. 1975`. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌. శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రమోద్‌, రాజు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌, రామానాయుడు స్టూడియోలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ, రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. తన `పోలీస్‌ స్టోరీ` చిత్రాన్ని ఇదే థియేటర్లో చూశారని, మళ్లీ 25ఏళ్ల తర్వాత ఈ సినిమా సక్సెస్‌మీట్‌ జరుపుకోవడం ఆనందంగా ఉందని, తన కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమైనట్టు ఉందని, తనకిది సెకండ్‌ ఇన్నింగ్స్ లాంటిదని ఎమోషనల్‌ అయ్యారు. ఇది తెలుగు సినిమా విజయమన్నారు. తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రతిబింబించిన చిత్రమిదని, ఓ వ్యక్తి అమెరికా నుంచి ఫోన్‌ చేసి, `నా తండ్రిని గుర్తు చేశారు. ఓ సారి వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుంది` అని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. 

సినిమాని రిలీజ్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్‌ ముత్యాల రాందాసు మాట్లాడుతూ, `కిరణ్ అబ్బావరం ఈ సినిమాలో నటించడమే కాకుండా.. ఆడియెన్స్  ఎటువంటి క్యారెక్టర్ చేస్తే రిసీవ్ చేసుకుంటారని భావించి తన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకోని కష్టపడి ఈ సినిమా కథ రాసుకున్నాడు. తన సినిమా ద్వారా ఎవరూ నష్టపోకూడదు అని మంచి దర్శక, నిర్మాతలతో  కొలబ్రెట్ అయ్యి వారందరూ కలసి అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం. అలాగే వీరి టీం మీద నమ్మకంతో మేము దైర్యం చేసి  ఈ సినిమాను విడుదల చేశాము. అన్ని ఏరియాల నుండి సినిమా బాగుందని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 

 సంగీత దర్శకుడు మాట్లాడుతూ ...ఈ సినిమాలోని సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలు ఇంత బాగా వచ్చాయి అంటే దానికి ముఖ్య కారణం భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్, హీరో,దర్శక నిర్మాతలే వీరందరి సపోర్ట్ తో పాటలు చాలా బాగా వచ్చాయి` అని అన్నారు. 

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, థియేటర్స్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అందరూ ఈ పాండమిక్‌ సిచ్యూవేషన్‌లో కూడా మమ్మల్ని నమ్మి  మా సినిమా విడుదల చేసినందుకు వారందరికీ పేరు పేరు న ధన్యవాదాలు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా ద్వారా మరోసారి నిరూపించారు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి మా సినిమా చూస్తున్నారు. చాలా మంది కొడుకులు వల్ల నాన్న పై ఉన్న ప్రేమను వ్యక్త పరచలేరు. ఈ సినిమా ద్వారా మాలోని ఆలోచనలను మీరు కళ్ళకు కట్టినట్లు చూపించారని చాలా మంది నాకు ఫోన్స్ చేసి కంగ్రాట్స్ చెపుతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా  చూసిన ప్రతి ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ లో కూడా మా సినిమా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ  చిత్రం ఇంత గొప్ప విజయం సాదించడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు` అని కిరణ్‌ తెలిపారు. 

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు శనివారం నుండి మరిన్ని థియేటర్స్ పెంచడం జరిగింది. ఈ సందర్భంగా  చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని సినీ పాత్రికేయులతో పంచుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, భరత్‌, దర్శకుడు పాల్గొని సినిమాకి వస్తోన్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios