ఫైనల్‌గా యంగ్ హీరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్‌ పెళ్లి పనులు ప్రారంభించాడు. కానీ ఈ లోగా కరోనా రావటం లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో పెళ్లికి బ్రేక్ పడింది. ముందుగా దుబాయ్‌లో డెస్టినేషన్‌ తరహా వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ కరోనా అన్ని ప్లాన్స్‌ను పాడు చేసింది. దీంతో ఇండియాలోనే సాదాసీదాగా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పట్లో పరిస్థతి చక్కబడే పరిస్థితి లేకపోవటంతో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు నితిన్‌. ఈ మేరకు అధికారికంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూలై 26 రాత్రి 8:30కు హైదరాబాద్‌లోనే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. లాక్ డౌన్‌ సమయంలోనే నిఖిల్‌, దిల్ రాజు లాంటి వారు చేసుకోగా నితిన్‌ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల భీష్మా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్‌,.. ప్రస్తుతం రంగ్‌దే, చెక్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్‌ రీమేక్‌తో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్‌ పేట సినిమాల్లో నటిస్తున్నాడు.