Asianet News TeluguAsianet News Telugu

కార్తీకదీపం అందుకే అలా సాగుతుంది... అసలు విషయం బయటపెట్టిన డాక్టర్ బాబు

కార్తీక దీపం సక్సెస్ పై హీరో పాత్ర చేస్తున్న నిరుపమ్ పరిటాల స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ సీరియల్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ముఖ్యకారకులు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గారు అని అన్నారు. 

actor nirupam paritala opens up on success of karthika deepam serial ksr
Author
Hyderabad, First Published Jul 18, 2021, 1:48 PM IST

తెలుగులో సీరియల్స్ లో రారాజుగా కొనసాగుతుంది కార్తీక దీపం సీరియల్. అత్యధిక టీఆర్పీ రేటుతో ఏళ్లుగా కార్తీకదీపం సీరియల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీప క్యారెక్టర్స్ సూపర్ పాప్యులర్. ఇక ఏళ్ళ తరబడి అంతం లేకుండా సాగుతున్న ఈ సీరియల్ పై మీమ్స్, జోక్స్ కూడా అనేకం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు మాత్రం కార్తీకదీపం ఎన్నాళ్లు వచ్చినా ఆస్వాదించాలని ఆశతో ఉన్నారు. 


కాగా కార్తీక దీపం సక్సెస్ పై హీరో పాత్ర చేస్తున్న నిరుపమ్ పరిటాల స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ సీరియల్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ముఖ్యకారకులు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గారు అని అన్నారు. ఆయన కాకుండా మరో దర్శకుడు ఈ సీరియల్ ని ఇంత అద్భుతంగా తీర్చిద్దిద్దలేరని అన్నారు. ప్రేక్షకుల నాడి తెలిసిన డైరెక్టర్, ఏ పాయింట్ ఎలా ఆసక్తికరంగా మలచాలో తెలిసిన మనిషిని అని తెలియజేశారు. 


ఇక సీరియల్ ఆదరిస్తున్నారని ఏదో ఒకటి తీసి సాగదీయాల్సిన అవసరం లేదని అన్నారు. కథలో అనేక స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే కథపై మాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికర ఎపిసోడ్స్ తో కార్తీక దీపం సీరియల్ సాగుతుందని నిరుపమ్ తెలియజేశారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కాపుగంటి రాజేంద్ర కార్తీక దీపం సెకండ్ పార్ట్ పై స్పందించారు. ప్రస్తుత మొదటి భాగంగా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. అనంతరం సీక్వెల్ గురించి ఆలోచిస్తాం అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios