సోషల్ మీడియా యుగంలో ఎవరికీ ఏ బుద్ధిపుట్టినా దానిని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీల పోస్టులు ఒకొక్కరిసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్వీర్ బోహ్రా తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనం రేపుతుంది. అతడు తన బాత్ రూమ్ లో అండర్ వేర్ లో అర్థనగ్నంగా ఫోటోలు దిగి... వాటిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

 
విషయంలోకి వెళితే సాధారణంగా బీచ్ లలో తారలు బికినీలు, లో దుస్తులలో సందడి చేస్తూ ఉంటారు. బీచ్ లో బికినీ వేసినా అది పెద్ద హాట్ టాపిక్ కాదు. కారణం అది బీచ్ కల్చర్ కాబట్టి. ఇక ఈ మధ్య కట్టగట్టుకొని అనేక మంది బాలీవుడ్,  టాలీవుడ్ స్టార్స్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది. తాప్సి, దిశా పటాని, కత్రినా, సమంత, కాజల్ మరియు కొంత మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేశారు. 
 
మాల్దీవ్స్ లో బికినీలో పోజులిచ్చిన తారలపై సెటైర్ వేశాడో ఏమోకానీ నటుడు కరణ్వీర్ బోహ్రా... బట్టలు విప్పడానికి మాల్దీవ్స్ కే వెళ్లాలా? అని తన అర్థ నగ్న ఫొటోలకు వివరణ ఇచ్చారు. తనకు సిక్స్ ప్యాక్ లేదని కొందరు అడుగుతున్నారని, వాళ్లకు కోసం బట్టలు  తీసేసి విప్పి చూపించాను అన్నారు. కరన్వీర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా... నెటిజెన్స్ లైక్స్ మరియు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.