దాదాపు మూడు శతాబ్దాలు చిత్ర పరిశ్రమకు సేవలు చేసిన నటుడు జయప్రకాశ్ రెడ్డి నేడు హఠాన్మరణం పొందారు. నేడు ఉదయం గుంటూరులో జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది. విలక్షణ నటుడిగినా వందల చిత్రాలలో నటించిన జయప్రకాశ్ రెడ్డి మరణం టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే జయప్రకాష్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. 

కాగా ప్రముఖ కమెడియన్ అలీ, జయప్రకాష్ రెడ్డి మరణంపై స్పందించారు. జేపీ అకాల మరణం తనను చాలా బాధపెట్టిందని అన్నారు. ఇక జయప్రకాశ్ రెడ్డి గురించి మాట్లాడుతూ సినిమాకంటే కూడా నాటక రంగంపై ఆయనకు ఎక్కువ మక్కువ ఉండేది. ఆయన ఓ గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. భాషా, యాసలపై చాలా పట్టున్న నటుడు. ప్రాంతాన్ని బట్టి తన యాసను మార్చి డైలాగ్ చెప్పేవారు. రాయలసీమ యాసకు ఒక గుర్తింపు తెచ్చిన నటుడిగా జయప్రకాశ్ రెడ్డిని చెప్పుకోవాలి అన్నారు. 

నాటక రంగంపై ఆయన విపరీతమైన ఆసక్తి కనబరిచేవారు. నాటకరంగాన్ని అభివృద్ధి చేయాలని ఆశించారు. దాని కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ని కలవాలని ఆయన అనుకున్నారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని తనని కోరారని అలీ చెప్పుకొచ్చారు. అంతగా నమ్ముకున్న కళ పట్ల నిబద్దత కలిగి ఉండేవాడని అలీ చెప్పుకొచ్చారు.