Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ చిరంజీవి జీవితంపై సినిమా-సీనియర్ నటుడి ప్రకటన

  • ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి
  • రాజకీయాల్లోనూ కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరు
  • చిరంజీవి జీవితంపై చిత్రం తెరకెక్కిస్తానంటున్న సీనియర్ నటుడు బెనర్జీ
  • బెనర్జీ ప్రకటనకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన చిరంజీవి?
actor benerjee want to make mega star chiranjeevi biopic

దక్షిణాదిలో సీనియర్ నటుడు బెనర్జీ గత 35 ఏళ్లుగా అనేక సినిమాలలో నటించాడు. మంచి పాత్రల్లో నటించాలన్న ఆలోచనతోనే బెనర్జీ మంచి కేరక్టర్ దక్కిన సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన కెరియర్ కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ  ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నటించిన "రక్తం" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

 

‘బంగారుతల్లి ఫేం’ రాజేశ్ దర్శకుడు తెరకెక్కించిన రక్తం సినిమా రిలీజ్‌కు ముందే విమర్శకలు ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులకు ఎంపిక అవుతున్న విషయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసిన బెనర్జీ.... మెగా స్టార్ చిరంజీవి పై ఆసక్తికర  కామెంట్స్ చేసాడు.  

 

కమ్యూనిస్టు భావాలతో ఉండే బెనర్జీ తొలుత డైరెక్టర్ కావాలని భావించి పరిశ్రమలో అడుగుపెట్టినా... అది కుదరక పోవడంతో నటుడిగా స్థిరపడ్డాడు. ఇప్పటివరకు 360 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇదే సందర్భంలో మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లుడుతూ చిరంజీవి వ్యక్తిత్యం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఏదైనా సాధించాలన్న తపనతో తన కెరియర్ తొలినాళ్ళలో  పరితపించిన చిరంజీవిని చూసి చాలా స్పూర్తిని పొందిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

 

అదే మెగా స్టార్ లోని తనకు నచ్చిన విషయం అని చెప్పిన బెనర్జీ.. చిరంజీవి జీవితం పై ఎవరైనా ఒక బయోపిక్ ను తీస్తే అది గొప్ప సినిమా అవుతుందని కామెంట్ చేసాడు. సాధారణ వ్యక్తిగా సినిమా రంగంలో అడుగుపెట్టి... ఒక మెగా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితాన్ని సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసాడు. అంతేకాదు అవకాశం ఇస్తే తానే చిరంజీవి జీవితం పై సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని చాలా ఆసక్తి కనబరిచాడు బెనర్జీ.

 

తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నందమూరి తారకరామారావు జీవితంపై  సినిమా తెరకెక్కిస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన నేపథ్యంలో... ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం పై బెనర్జీ సినిమా ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios