కాస్టింగ్ కౌచ్ ఉందని కూతురిని ఎలా అడ్డుకుంటా..? సీనియర్ హీరో

actor arjun comments on casting couch
Highlights

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే.. ప్రతి రంగంలో అది ఉంది. చాలా మందికి ఇండస్ట్రీపై చెడు అభిప్రాయం ఉండొచ్చు కానీ మంచి, చెడు అనేది మన ఎంపికలో ఉంటుంది. మంచి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎవరూ అడ్డుకోరు

తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో నటించిన హీరో అర్జున్ సార్జా.. ఇప్పటికీ నటుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 38 ఏళ్ల పాటు నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్న ఆయన పలు రకాల పాత్రలతో ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ తన ప్రతిభ చాటుతున్నాడు. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

దాదాపు ఐదేళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన ఐశ్వర్యకు సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కి 'కాస్టింగ్ కౌచ్' కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. హీరోయిన్ గా తన కూతురు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కాస్టింగ్ కౌచ్ పై ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని ఆసక్తిగా చూశారు.

'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే.. ప్రతి రంగంలో అది ఉంది. చాలా మందికి ఇండస్ట్రీపై చెడు అభిప్రాయం ఉండొచ్చు కానీ మంచి, చెడు అనేది మన ఎంపికలో ఉంటుంది. మంచి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎవరూ అడ్డుకోరు. చెడు దారిలో వెళ్లాలనుకుంటే అది వారి దురదృష్టం. ఇక్కడ ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాలోకి రానివ్వకుండా నేను అడ్డుకోవాలా..? అలా అయితే మిగిలిన వాళ్ల సంగతి ఏంటి..? వాళ్లు కూడా తమ కూతుళ్లను రానిస్తున్నారు కదా.. నేను ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాను. అన్నీ తెలిసి కూడా నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి' అని అన్నారు. 

loader