టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించి తరువాత సినిమాలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నటుడు సమీర్. బిగ్ బాస్‌ సీజన్‌ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సమీర్ పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో వినిపించాయి. `నా మొగుడు నాకే సొంతం` అనే సీరియల్‌ సమీర్ హీరోయిన్‌తో రాసలీలలు సాగించాడన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆయన్ను ఆ సీరియల్‌ నుంచి తొలగించారు.

ఈ ఘటనలపై ఇటీవల ఓ షోలో మాట్లాడిన సమీర్ తన భార్య తన గురించి ఏం అనుకుంటుందో కూడా చెప్పాడు. నన్న పెళ్లిచేసుకున్నందుకు నా భార్య ఇప్పుడు కూడా బాధపడుతుందని చెప్పాడు సమీర్. బయటకు చెప్పకపోయినా ఆమె ఫీల్ అవుతున్న విషయం తనకు తెలుసన్నాడు. మరో వ్యక్తిని చేసుకొని ఉంటే తన లైఫ్‌ ఇంకా బెటర్‌గా ఉండేది.. కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను టాప్‌ అని చెప్పాడు. అయితే ఆమె జీవితానికి చాలా బాగా ప్లాన్ చేస్తుందని, చాలా బాగా చదువుకుందని చెప్పాడు.

తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు సమీర్‌. అయితే ఎప్పుడు వారితో హద్దులుదాటి ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు ఎవరితోనూ సెక్సువల్ రిలేషన్ షిప్స్‌ లేవని క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటి రిలేషన్స్‌ చేసేటప్పుడు బాగానే ఉన్నా తరువాత బయటపడితే పరువు పోతుందని, అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటానని  చెప్పాడు. అయితే అమ్మాయిల నుంచి తనకు కూడా ప్రపొజల్స్‌ వచ్చాయన్న సమీర్ తాను మాత్రం ఎప్పుడు హద్దులు దాటలేదని చెప్పుకొచ్చాడు.