మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాకి హీరోయిన్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేటట్లు కనపడటం లేదు. మొదట ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె  ఊహించని విధంగా తప్పుకొని షాకిచ్చింది.  దాంతో రకరకాలుగా ఆలోచించి.. మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపేలా  ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్‌తో భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు కొరటాల. ఈ మేరకు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి కాజల్‌ని తీసుకొచ్చారు. కానీ తీరా సెట్స్ మీదకొచ్చే సమయానికి త్రిష లాగే కాజల్ కూడా  ప్రక్కకు వెళ్లే పరిస్దితి ఉందని తెలుస్తోంది. అందుకు కారణం ..కాజల్ రీసెంట్ ప్రకటనే.

కాజల్ రీసెంట్ గా తన వివాహ తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లిచేసుకోబోతోంది.  అక్టోబర్ 30న  గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. ముంబైలోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరుగుతున్నట్లు చెప్పింది. కోవిడ్ నిబంధనల వల్ల తక్కువ మందితో  జరుగుతున్నట్లు చెప్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు తానుచాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నందకు మీ సపోర్ట్ కావాలని..తమను  ఆశీర్వదించాలని కోరింది. 

అంతవరకూ బాగానే ఉంది. కాజల్ పెళ్లి చేసుకోబోతుంది ఈ సంవత్సరం అని ఆచార్య నిర్మాతలకు ముందే తెలసట. అయితే అంత తొందరగా ముహూర్తం పెట్టుకుంటుంది అనుకోలేదట.  దాంతో వివాహానంతరం ఆమె ఎంత లేదన్నా రెండు నెలలైనా వైవాహిక జీవితంలో బిజీగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా షూటింగ్ లకు వస్తుంది.

  దాంతో ఆమెను తీసేసి వేరే వాళ్లను ఆ ప్లేస్ లోకి తీసుకు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన టీమ్ చేస్తోందని వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు కొరటాల టీమ్ ఇప్పటకే సెర్చింగ్ మొదలెట్టిందిట.  మరో ప్రక్క  ఎందుకైనా మంచిదని...తన వివాహం ప్రభావం..కెరీర్ పై పడకూడదని ఆలోచించి ..పెళ్లి తర్వాత కూడా తాను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ట్వీట్ చేసింది కాజల్.