'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమా షూటింగ్ లో నిర్మాత ప్రకాష్ ఝా తనతో తప్పుగా మాట్లాడారని నటి అహనా కుమ్రా ఆరోపణలు చేశారు. 2016లో వచ్చిన ఆ సినిమాకు అలంకృతా శ్రీవాత్సవ దర్శకత్వ వహించారు. ప్రకాష్ ఝా నిర్మించారు.

అయితే ఈ సినిమా సెట్ లో జరిగిన ఓ సంఘటనను నటి అహనా కుమ్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో శృంగారభరితమైన సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు ప్రకాష్ ఝా సెట్ కి వచ్చి.. ఆ సీన్ విషయంలో తనను ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. 

ఆయన ఆ సీన్ ఎలా చేయాలో సలహాలు ఇస్తుంటే వినడానికి అసౌకర్యంగా అనిపించిందని, దీంతో వెంటనే దర్శకురాలు దగ్గరకి వెళ్లి విషయం చెప్పానని వివరించింది. దీంతో డైరెక్టర్ ఆయన్ని బయటకి వెళ్లమని చెప్పడంతో మేం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నామని ఆయనకి అర్ధమైందని చెప్పుకొచ్చింది.

కెరీర్ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో తనకు వేధింపులు ఎదురయ్యాయని గతంలో ఈ బ్యూటీ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. ఓ వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించడం సహించలేకపోయాయని.. అలా ఇబ్బంది పెట్టిన వారందరీ నెంబర్లు బ్లాక్ చేసినట్లు తెలిపింది.