మూడేళ్ళ తరువాత పవన్ నుండి వస్తున్న చిత్రం వకీల్ సాబ్. పవన్ ని వెండితెరపై చూడాలని వేయికళ్ళతో చూస్తున్న ఆయన ఫ్యాన్స్ ఈ చిత్ర ప్రతి అప్డేట్ ని పండగలా జరుపుకుంటున్నారు. కాగా న్యూ ఇయర్ పురస్కరించుకొని వకీల్ సాబ్ నుండి టీజర్ సిద్ధం చేశారు చిత్రం యూనిట్. కాగా జనవరి 1న విడుదల కానున్న వకీల్ సాబ్ టీజర్ పై నేడు రాత్రి 12:00 గంటలకు అప్డేట్ సిద్ధం చేశారు. వకీల్ సాబ్ అనౌన్స్మెంట్ పోస్టర్ తో పాటు, టీజర్ టైమింగ్ ఏమిటో తెలియజేయనున్నారు చిత్ర బృందం. 

దీనితో ఒకవైపు కొత్త సంవత్సరం 2021కి వెల్కమ్ చెవుతూనే... వకీల్ సాబ్ టీజర్ అప్డేట్ ని ఎంజాయ్ చేయనున్నారు పవన్ ఫ్యాన్స్. కాగా వకీల్ సాబ్ షూటింగ్ దర్శకుడు వేణు శ్రీరామ్ నిన్ననే పూర్తి చేశారు. దీనితో వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. త్వరలోనే వకీల్ సాబ్ విడుదల తేదీపై ప్రకటన రానుంది. 

కరోనా లేని పక్షంలో వకీల్ సాబ్ 2020, మేలో విడుదల అయ్యేది. నెలల తరబడిన సాగిన లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. నివేదా థామస్, అంజలి కీలక రోల్స్ పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నాడు.