సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి మూడు నెలలు అవుతున్నా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గానే ఉంది. ఆయన మరణం వెనుక కారణాలు నిగ్గు తేల్చేందుకు ఒక ప్రకా విచారణ కొనసాగుతున్నా, మీడియాలో అనేక కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన ఆయన ఇంటికి ఓ లేడీ వెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. మాస్క్ ధరించి ఉన్న ఆ అమ్మాయి ఎవరనేది వీడియోలో అర్థం కాలేదు. 

దీనితో సోషల్ మీడియాలో ఆ మిస్టీరియస్ లేడీ ఎవరు, ఆ రోజు ఆమెను సుశాంత్ ఇంటికి ఎందుకు వెళ్లిందని పెద్ద చర్చకు తెర లేచింది. సుశాంత్ మరణంతో ఆ లేడీకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అనేక మంది ఊహాగానాలు మొదలు పెట్టారు. కాగా మాస్క్ లో వచ్చిన ఆ మిస్టీరియస్ లేడీ పేరు జమీలా అని తెలిసింది. జమీలా రియా చక్రవర్తి తమ్ముడైన షోవిక్ చక్రవర్తి ఫ్రెండ్.

సుశాంత్ మరణ వార్త మీడియా ద్వారా తెలుసుకున్న జమీలా సుశాంత్ ఇంటికి వచ్చారట. ఐతే అక్కడ ఉన్న పోలీసులు జమీలాను లోపలికి అనుమతించ లేదట దీనితో జమీలా అక్కడ నుండి వెనుదిరిగారట. అల మిస్టీరియస్ లేడీగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయిన లేడీ ఐడెంటిటీని బయటపెట్టడం జరిగింది. సుశాంత్ డెత్ కేసు విచారణలో పాల్గొన్న రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యూడీషియల్ కస్టడీ అనుభవిస్తున్నారు.