Asianet News TeluguAsianet News Telugu

‘వకీల్‌సాబ్‌’ :ఇరవై కాదు 35


వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం. 

35 working days of shoot left for Vakeel Saab
Author
Hyderabad, First Published Jun 2, 2020, 8:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత కొద్ది కాలంగా లాక్‌డౌన్‌  తో స్తంభించి పోయిన సినీ పరిశ్రమలో సందడి మొదలు కాబోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి పరిశ్రమకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. జూన్‌ నుంచి షూటింగ్ లు కూడా ప్రారంభించుకోవచ్చని ఓ స్పష్టతనిచ్చేసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలంతా తమ తమ ప్రాజెక్టులను తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిలా సెట్స్‌పైకి వెళ్లబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’పైనే ఉంది. 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం. 

అయితే ఇంకా షూటింగ్ ఇరవై రోజులు మాత్రమే ఉందని అంతటా ప్రచారం జరుగుతోంది. కానీ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఇంకా 35 వర్కింగ్ డేస్ పెండింగ్ ఉందిట. అలాగే మినిమం రెండు నుంచి మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పడుతుంది. దాంతో కొన్ని ముందు అనుకున్న సీన్స్ తీసేద్దామా అనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ విషయం పవన్ తో మాట్లాడి ఫైనలైజ్ చేసి షూటింగ్ కు వెళ్తారు. సాధ్యమైనంత తొందరలో షూటింగ్ పూర్తి చేసి.. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నారట దిల్ రాజు. 

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగస్టు నాటికి కానీ, థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేదు. కాబట్టి అవి తెరచుకోని ప్రజలు కాస్త అలవాటు పడటానికి మరో రెండు నెలల సమయమైనా పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా దసరా సీజన్‌ పై కాన్సర్టేట్ చేస్తోందిట ‘వకీల్‌సాబ్‌’ టీమ్.


అలాగే ఈ షెడ్యూల్ లో వకీల్ సాబ్ కు ఉన్న ప్లాష్ బ్యాక్ స్టోరీ ని షూట్ చేస్తారట. అందులోనే హీరోయిన్ కనపడుతుంది. ఠాగూర్ లో చిరుకు,జ్యోతికకు ఉన్న ప్లాష్ బ్యాక్ లాంటిది ప్లాన్ చేసారట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో వకీల్ సాబ్ ..పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోతాడట. అంతేకాదు అతని యాటిట్యూడ్ లో సైతం మార్పు వస్తుంది.  అయితే ఇవి ఒరిజనల్ వెర్షన్ లో లేవు. 
 
 ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట.  అలాగే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కి అండ్ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోని కపూర్ సమర్పిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios