‘పాక్ క్రికెటర్ అఫ్రిదీతో సెక్స్ లో పాల్గొన్న’

'Yes, I had sex with Shahid Afridi': Ex Bigg Boss 11 contestant Arshi Khan clears the air on her controversial tweet
Highlights

బాలీవుడ్ నటి అర్షిఖాన్ ట్వీట్ వివరణ

బాలీవుడ్ నటి అర్షిఖాన్ వివాదానికి మరో పేరు. ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేస్తూ.. వివాదానికి శ్రీకారం చుట్టడం ఈ అమ్మడికి కొత్తేం కాదు. అయితే.. మూడేళ్ల క్రితం ఆమె చేసిన ఓ ట్వీట్ అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. కాగా.. ఈ ట్వీట్ కి సంబంధించి ఆమె తాజాగా  వివరణ ఇచ్చింది.

మూడేళ్ల క్రితం.. తాను ‘‘ పాక్ క్రికెటర్ అఫ్రిదీతో సెక్స్ లో పాల్గొన్నాను. దీనికి కూడా భారత మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం.. ఇది నా ప్రేమ ’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. అయితే.. అలా ట్వీట్ చేసిన తర్వాత అర్షి ఖాన్.. ఈ విషయం గురించి మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే.. తాజాగా ఆ ట్వీట్ వెనుక ఉన్న అసలు విషయాన్ని ఈ అమ్మడు బయటపెట్టింది.

తాజాగా ఓ ఛానెల్‌ చిట్‌ఛాట్‌ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్‌ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్‌ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా’ అంటూ అర్షి పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే ప్రసారం కానుంది. 

 ఈ అమ్మడు బిగ్ బాస్ హౌజ్ లో కూడా పాల్గొంది. కాగా, అఫ్రిదీ వ్యవహారంలో అర్షిపై అప్పట్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గెహానా వశిష్ఠ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు అర్షి చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పుకుంటోందంటూ గెహానా తెలిపారు.

loader