బయిట పరిస్దితులు అసలు బాగోలేవు. క్యాజువల్ గా తుమ్మినా,దగ్గినా కరోనా అని సందేహపడే పరిస్దితులు వచ్చేసాయి. దాంతో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ముఖ్యంగా హాస్పటిల్ కు వెళ్లారంటేను మరీను. అయితే ఇవన్నీ గమనిస్తున్నా హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం తన అభిమానులకు ఝలక్ ఇవ్వాలనుకుందో ఏమో కానీ ముఖానికి మాస్క్ తో ఓ హాస్పటల్ లో ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ కు కంగారు మొదలైంది.

ఈ మ‌రాఠీ మన సౌత్‌లో క‌న్నా బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టిస్తుంది. రీసెంట్ గా ఇండియాకి వ‌చ్చిన రాధికా వెంటనే తిరిగి లండ‌న్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో త‌న‌కి ఎదురైన ఎక్సపీరియన్స్ ని ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. హాస్పిట‌ల్‌లో ఉన్నాన‌ని రాసుకొచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hospital visit! #notforcovid19 #nothingtoworry #alliswell #safeandquarantined 😷

A post shared by Radhika (@radhikaofficial) on Mar 27, 2020 at 3:39am PDT

బ్రిటన్ మొత్తం కరోనా కో కంగారెత్తిపోతున్న వేళ... రాధికా హాస్పిట‌ల్‌కి వెళ్లిందంటే క‌రోనా సోకిఉంటుందా అనే అనుమానాన్ని జ‌నాలు వ్య‌క్తం చేయటం మొదలెట్టారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టింది.కొన్ని హ్యాష్ ట్యాగ్స్ జ‌త చేసి...భయ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అంతా మంచిగానే ఉంది. క్వారంటైన్‌లో ఉండి క్షేమంగా ఉండండి అని స్ప‌ష్టం చేసింది. 

 

రాధికా ఆప్టే పోస్ట్‌పై స్పందించిన గ‌ల్లీబాయ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌.. ఓమై గాడ్.. టేక్ కేర్ డియ‌ర్.. గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ పెట్టాడు. అయితే కరోనా కానప్పుడు అంతగా... రాధికా ఆప్టే ఈ టైమ్ లో హాస్పటిల్ కి పోవ‌ల‌సిన అవ‌స‌రం ఏమోచ్చింద‌ని ఫ్యాన్స్ డిస్కస్ చేయటం మొదలెట్టారు.