టాలీవుడ్ లో బ్యాచ్ లర్ లిస్ట్ పెద్దగానే ఉంది. యువహీరోలు పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకుంటూ తిరుగుతున్నారు. మన హీరోలను పెళ్లికి ఒప్పించలేక వాళ్ల  ఇంట్లోవాళ్ళు చాలా సతమతమవుతున్నారట. ప్రభాస్ నుంచి వరుణ్ తేజ్ వరకు అందరు ఎదో ఒక సాకుతో తప్పించుకుంటున్నవారే. ఇక మొత్తానికి నిఖిల్ - నితిన్ ఒక ఇంటివాళ్ళు కావడానికి సిద్ధమయ్యారు.

అయితే వీరికి పిల్ల దొరగ్గానే మరోవైపు సక్సెస్ కూడా వచ్చింది. దీంతో పెళ్లి అనేది బాక్స్ ఆఫీస్ హిట్టు లాంటిదనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటె నిఖిల్ తన ప్రేయసిని పెళ్లాడాలని అనుకున్న కొన్ని రోజులకే అర్జున్ సురవరం రిలీజయ్యింది. ఆ సినిమా చాలా కాలంగా వాయిదాలు పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రిలీజయ్యి సక్సెస్ కావడంతో నిఖిల్ తన పెళ్లి గురించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు.  ఇక నితిన్ అయితే పెళ్లి పనుల్లో ఉంటూనే భీష్మ సినిమాని విడుదల చేశాడు.

పసుపు కుంకుమ ఈవెంట్ తో తనకు కాబోయే భార్యని ప్రపంచానికి చూపించాడు. ఆ తరువాత రిలీజైన భీష్మ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటిరోజే రికార్డు సృష్టించింది. కెరీర్ బెస్ట్ హిట్టు అనే టాక్ కూడా వస్తోంది. ఈ విధంగా నితిన్ కూడా పెళ్లి సెలబ్రేషన్స్ లోనే బాక్స్ ఆఫీస్ హిట్టు అందుకున్నాడు. గతంలో గోపీచంద్ కూడా పెళ్లి చేసుకోగానే సాహసం - లౌక్యం - జిల్ వంటి సక్సెస్ లు అందుకున్నాడు. పెళ్లి చేసుకుంటే కెరీర్ ట్రాక్ అదుపు తప్పుతుందని భయపడే హీరోలు వీళ్ళు మంచి సందేశాన్ని ఇస్తున్నారని చెప్పవచ్చు