అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి. దీనితో టాలీవుడ్ లో మరో స్టార్ రెడీ అవుతున్నాడనే అంచనాలు ఎక్కువయ్యాయి. 

కానీ ఇటీవల విజయ్ దేవరకొండపై వస్తున్న విమర్శలకు తోడు.. సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. విజయ్ దేవరకొండ గత ఏడాది నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నిరాశపరిచింది. తాజాగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. ఫిలిం క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు. 

తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్ల షేర్ రాబట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఇక రెండవరోజు ఈ చిత్ర వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నెగిటివ్ టాక్ ఎక్కువవుతుండడంతో రెండవ రోజు ఈ చిత్రం 2.4 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం రెండు రోజుల్లో ఈ చిత్రం 8 కోట్ల షేర్ రాబట్టింది. 

ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకు ఉంది. దీనితో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఇక వచ్చే వారం నితిన్ నటించిన భీష్మ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తొలి వారం ఎంత వసూళ్లు రాబడితే  ఆస్థాయిలో నష్టాలు తగ్గుతాయి. 

నితిన్ అత్తా మామల షాకింగ్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డి చిత్రం నుంచి ఒకే తరహా నటన కనబరుస్తున్నాడనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ చిత్రం విజయ్ దేవరకొండకు ఓ వార్నింగ్ బెల్ లాంటిది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పూరి తెరకెక్కించబోయే చిత్రంపై ఆసక్తి నెలకొంది. హీరోలని సరికొత్త బాడీ లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడంలో పూరి దిట్ట. 

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. జిగేల్ రాణి అందాల మెరుపులు!