ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల‌కి డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరో, హీరోయిన్‌లు కూడా వెబ్ సిరీస్ లో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్‌గా స‌మంత కూడా 'ది ఫ్యామిలీ మెన్'అ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఈ  వెబ్ సిరీస్ లను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో 'చదరంగం' అనే పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. 

మంచు విష్ణు 'చదరంగం'.. డేట్ ఫిక్స్ చేశారు!

సునైనా, నాగినీడు వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాని రాజ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందుతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ని ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుండి ఈ సిరీస్ ని జీ5 యాప్‌లో చూడొచ్చు. ఈ సిరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లతో నిండి ఉంటుంది.