కొయ్యలని ఇంటి ఫర్నీచర్ గా మాత్రమే కాదు అద్భుతమైన బొమ్మలు, దేవుడి విగ్రహాలు, అందమైన ఆకృతులుగా కూడా మార్చవచ్చు. కొయ్యని అందమైన ఆకృతులుగా మలిచే కళాకారులకు మంచి డిమాండ్ ఉంది. హీరో మంచు విష్ణు ఇండియా 36వ కొయ్య కళాకారుల ప్రదర్శనని తిరుపతిలో ప్రారంభించాడు. 

జ్ఞాన అనే సంస్థ ఇండియాలో వివిధ ప్రాంతాలకు చెందిన కొయ్య కళాకారులందరిని ఒక్క చోటికి చేర్చి ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. నేడు( శుక్రవారం, నవంబర్ 15) ప్రారంభమైన ఈ కొయ్య కళాకారుల ప్రదర్శన 20 రోజుల పాటు తిరుపతిలో వైభవంగా జరగనుంది. 

దాదాపు 15వేల మంది కొయ్య కళాకారులు, శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విద్యానికేతన్ కళాశాల ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడం విశేషం. మంచు విష్ణు మాట్లాడుతూ.. నేను కళాకారులని, నైపుణ్యాని ఇష్టపడే వ్యక్తిని. ఇండియాలో ఇలాంటి నైపుణ్యం ఎక్కడ ఉన్న బయటకు రావాలి అని మంచు విష్ణు తెలిపాడు. 

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాధా వినోద్ శర్మకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని మంచు విష్ణు తెలిపాడు. ఇలాంటి కళా నైపుణ్యం చూసి విద్యార్థులు కూడా ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో శ్రీ విద్యానికేతన్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విష్ణు తెలిపాడు. 

ఈ సందర్భంగా విష్ణు కొయ్య కళాకారులు చేసిన వివిధ ఆకృతులని పరిశీలించాడు.