చాలా కాలం తరువాత టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన రాములమ్మ సినిమా కోసం పారితోషికం ఎంత తీసుకుంది అనే దానిమీద రోజుకో గాసిప్ పుట్టుకొస్తూనే ఉంది.

అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి తన రెమ్యునరేషన్ పై ఎవరు ఊహించని ఆన్సర్ ఇచ్చిందట. ఓ విధంగా సినిమాలో హీరోయిన్ కంటే తన పారితోషికం ఎక్కువే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. అంటే మహేష్ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమెకే అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ లో వస్తున్న రూమర్స్ ప్రకారం విజయశాంతి 1.5కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది.

ఓ విధంగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కంటే కూడా ఈ ఎమౌంట్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇదే తరహాలో కొనసాగితే రాములమ్మ ఆ నెంబర్స్ ని ఇంకా అవకాశం లేకపోలేదు. రమ్యకృష్ణ కూడా డేట్స్ ని బట్టి దాదాపు కోటి వరకు డిమాండ్ చేస్తోందట. వీరు హీరోయిన్స్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడు లేడి టైగర్స్ గా సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేస్తూ.. మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.మరీ నెక్స్ట్ రాములమ్మ ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.