Asianet News TeluguAsianet News Telugu

రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ..?

ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ స్టార్టైంది. వీకెండ్ కూడా పికప్ కాలేదు. ఇక భీష్మ దెబ్బకు ఈ సినిమా పూర్తిగా థియోటర్స్ నుంచి మాయిమైపోయింది. 

Vijay devarakonda returned some portion of his remuneration
Author
Hyderabad, First Published Feb 24, 2020, 10:49 AM IST

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అతి త‌క్కువ సమయంలోనే హీరోగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడీ యంగ్ హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను న‌టించిన చిత్రాల్లో ఏడు మాత్ర‌మే విడుద‌ల‌యితే... అందులో మూడు (`పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం`) సినిమా సూప‌ర్‌సక్సెస్‌ల‌య్యాయి. దాంతో మిగతా సినిమాలు వర్కవుట్ కాకపోయినా విజ‌య్‌కి యూత్‌లో క్రేజ్ త‌గ్గలేదు.  

అలాంటి ఈ హీరో ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`  మొదటనుంచీ అనుకున్నట్లుగానే డిజాస్టర్ అయ్యింది. హీరో, నలుగురు హీరోయిన్స్‌తో చేసిన రొమాన్స్ ఏదీ జనాలకు పట్టలేదు.  చివ‌ర‌కు ఈ ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు?  అనే విష‌యం క్లారిటీ రాలేదు. ఇవన్నీ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించాయి.

విజయ్'వరల్డ్ ఫెమస్ లవర్'.. నష్టమెంత?

ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ స్టార్టైంది. వీకెండ్ కూడా పికప్ కాలేదు. ఇక భీష్మ దెబ్బకు ఈ సినిమా పూర్తిగా థియోటర్స్ నుంచి మాయిమైపోయింది. దాంతో ట్రేడ్ వర్గాల వేసిన అంచనా ప్రకారం... 70%  దాకా లాస్ వచ్చింది. అంటే దాదాపు 20 కోట్లు దాకా లాస్ వచ్చినట్లే. ఈ లాస్ ని కవర్ చేయటానికి విజయ్ దేవరకొండ తన రెమ్యునేషన్ లో కొంత భాగం వెనక్కి నిర్మాతకు ఇచ్చేసినట్లు సమాచారం.

మరి ఇప్పుడు నిర్మాత కెఎస్ రామారావు తనను నమ్మి సినిమాని మంచి రేట్లకు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఏ విధంగా రికవరీ ఇవ్వబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే తను తదుపరి తీసే చిత్రాన్ని తక్కువ రేట్లుకు ఇప్పుడు నష్టపోయినవారందిరికీ ఇస్తానని నిర్మాత ...చెప్తున్నా...డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదని అంటున్నారు. దాంతో తిరిగి వెనక్కి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్దితి వస్తుందంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios