టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు ఇటీవల వచ్చిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా కూడా మొదటిరోజే ప్లాప్ టాక్ తో మాయమైంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఆ సినిమా మొదలైంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరుస అపజయాలతో ఉన్న విజయ్ ఇప్పుడు ఏదైనా కమర్షియల్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అంతవరకు ప్రయోగాత్మక కథలను దూరం పెట్టాలని అనుకుంటున్నాడట. రీసెంట్ గా హీరో అనే ప్రాజెక్ట్ కూడా విజయ్ ఆలోచన మేరకే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఇక కమర్షియల్ కామెడీ కథలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చే మారుతితో సినిమా చేస్తే ట్రాక్ లోకి రావచ్చని రౌడీ బాయ్ ఆలోచిస్తున్నాడట. ఎందుకంటె గతంలో వరుస అపజయాలతో ఉన్న నాని కెరీర్ కి భలే భలే మగాడివోయ్ సినిమాతో మారుతి బూస్ట్ ఇచ్చాడు. అదే విధంగా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కి కూడా ప్రతి రోజు పండగే సినిమాతో సక్సె అందించాడు. అందుకే మారుతితో విజయ్ ఒక సినిమాని ప్లాన్ చేయాలనీ అనుకుంటున్నాడు, మరీ ఆ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.