Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి అలజడి సృష్టించబోతున్న వెంకటేష్!

విక్టరీ వెంకటేష్ గత ఏడాది ఆరంభంలో ఎఫ్2 చిత్రంతో, చివర్లో వెంకీ మామ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఓ క్రేజీ చిత్ర రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Victory Venkatesh 74 first look will release on midnight
Author
Hyderabad, First Published Jan 21, 2020, 9:10 PM IST

విక్టరీ వెంకటేష్ గత ఏడాది ఆరంభంలో ఎఫ్2 చిత్రంతో, చివర్లో వెంకీ మామ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఓ క్రేజీ చిత్ర రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్ చిత్ర తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించబోతున్నాడు. 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ఫిక్స్ అయ్యాడు. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లోనే.. మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

స్టేజి వెనుక మాజీ భర్తతో హీరోయిన్ రాసలీలలు.. వైరల్ అవుతున్న పిక్స్!

భూ ఆక్రమణలు, కుల వివాదాల నేపథ్యంలో తెరకెక్కిన అసురన్ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ధనుష్, మంజు వారియర్ జంటగా నటించారు. 

స్వతహాగా విభిన్నమైన కథలపట్ల మక్కువ చూపే వెంకటేష్.. అసురన్ రీమేక్ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. పూర్తిస్థాయిలో నటనకు ఆస్కారం ఉన్న ఈ చిత్రంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఫస్ట్ లుక్ లో తెలియనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios