ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన అందాల భామలు తమ అభిమానులను అలరించేందుకు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వెండితెర మీద ఆకట్టుకునే అవకశాం లేకపోవటంతో సోషల్ మీడియా వేదిక అందాలు ఆరబోస్తున్నారు కొందరు తారలు. ఈ లిస్ట్‌ లో ముందుగా చెప్పుకోవాల్సిన భామ ఊర్వశీ రౌతేలా. తాజాగా ఈ భామ గతంలో చేసిన ఓ హాట్‌ ఫోటోషూట్‌కు చెందిన ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఊర్వశీ రౌతేలా గతంలో దిగిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తోంది. అదే సమయంలో ప్రజల్లో సోషల్ డిస్టాన్సింగ్‌ విషయంలో అవసరమైన జాగ్రత్తలను షేర్ చేస్తోంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్‌ చేసిన ఊర్వశీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. వరుసగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తున్న ఊర్వశీ ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఈ బోల్డ్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 25 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఇటీవల పాగల్‌ పంతి సినిమాలో నటించింది ఊర్వశీ. ఈ సినిమాలో జాన్‌ అబ్రహం, ఇలియానాలు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న వర్జిన్‌ భానుప్రియ సినిమాలో నటిస్తోంది.