కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన అందాల భామ ఊర్వశీ రౌతేలా అభిమానులను అలరించటంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. వరుసగా హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్‌ అందిస్తోంది. వరుసగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో సెగలు రేపుతోంది.

తాజాగా ఈ భామ మరో హాట్ వీడియోను షేర్‌ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో సాగర కన్యలా కూర్చున్న వీడియోను షేర్‌ చేసింది. పూల్‌ లో ఉన్న ఊర్వశిని చూట్టూ తిరుగుతూ వీడియో తీశారు. ఊర్వశీ ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. కేవలం 40 నిమిషాల్లోనే ఈ వీడియోను 4 లక్షల మంది చూడటం విశేషం.

బాలీవుడ్‌ లో సనమ్‌ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 లాంటి హాట్ సినిమాల్లో నటించిన ఈ భామకు స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.