పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. 'జల్సా'తో మొదలైన వీరి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన 'అజ్ఞాతవాసి' మాత్రం ఫ్లాప్ అయింది.

ఈ సినిమా తరువాత పవన్ రాజకీయాల వైపు వెళ్లిపోయారు. త్రివిక్రమ్ వరుసగా.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు పవన్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

పవన్ సినిమాకి రేటు పలకడం లేదా..?

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి టాక్ బయటకి రాలేదు. కానీ ఎలాంటి హడావిడి లేకుండా త్రివిక్రమ్.. పవన్ ని కలిసి కథ చెబుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని నిర్మాత ఎవరు..? వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందనే వివరాలు ఇంకా బయటకి రాలేదు.

కానీ పవన్ కి త్రివిక్రమ్ కథ చెబుతున్న మాట మాత్రం నిజమని పవన్ టీం నుండి వస్తోన్న సమాచారం. ఎన్టీఆర్ నటిస్తోన్న 'RRR' సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న కారణంగా ఈలోగా పవన్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ 'పింక్' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సమాంతరంగా క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా ఉంది. మరి త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి!