ప్రముఖ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'. స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్ తీసుకొని దర్శకుడు హితేష్ కేవల్య ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ గే క్యారెక్టర్ పోషించారు.

ఆయుష్మాన్ ప్రియుడిగా జితేంద్ర కుమార్ నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ఆయుష్మాన్, జితేంద్రకు మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. దీంతో ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సీన్ గురించి ఆయుష్మాన్ భార్య తహీరా కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

మోసగాడిని కాదు.. ఆమె ఏడుపు వల్ల నేను బలి, బ్రేకప్ కు కారణం ఇదే!

తన భర్త మరో మగాడిని స్క్రీన్ పై లిప్ లాక్ చేయడం చూసి ఎగ్జైట్ అయ్యాయని..ఆర్టిస్ట్ కోణంలో సినిమా చూస్తానని చెప్పింది. ఓ ఆర్టిస్ట్ స్క్రీన్ పై అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే ఏంటి..? అబ్బాయిని ముద్దు పెట్టుకుంటే ఏంటి..? అని ప్రశ్నించింది. ఒకవేళ తను గనుక సినిమా తీసుంటే ఆర్టిస్ట్ లతో అలానే చేయించేదాన్ని అని చెప్పారు.

'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' సినిమాలో తన భర్త గే రోల్ లో నటించారు కాబట్టి సాధారణంగా అబ్బాయినే ముద్దు పెట్టుకుంటాడని అన్నారు. ఒక అబ్బాయికి అమ్మాయిపై ప్రేమ ఉన్నా, లేక అబ్బాయిపై ప్రేమ ఉన్నా ఆ ప్రేమని వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకుంటాడని.. అందులో తప్పేముందని అన్నారు. ఈ శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.