తెలుగు తెర మీద ఎన్నో అద్భుత విజయాలు సాదించిన లెజెండరీ హీరో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన చేయని ప్రయోగమే లేదు. 300 లకు పైగా చిత్రాల్లో హీరో నటించిన ఈ సూపర్ స్టార్ కొంతకాలంగా వయో భారం తో ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజా ఈ సూపర్ స్టార్ దర్శకుడు అవతారం ఎత్తాడు. అది కూడా తన మనవడీ సినిమా కోసం కావటం విశేషం.

మనవడి కోసం అంటే మహేష్ తనయుడు గౌతమ్ కోసం అనుకుంటారేమో.. కాదు కాదు.. కృష్ణ తన కూతురి కొడుకు కోసం దర్శకుడిగా మరాడట. అసలు విషయానికి వస్తే కృష్ణ కూతురి కొడుకు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎం పీ గల్లా జయదేవ్ తనయుడి ఈ అశోక్. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

అయితే గతం లో షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు కృష్ణ సెట్ కు వెళ్లారు. దీంతో దర్శకుడు శ్రీరామ్ ఒక సన్నివేశానికి కృష్ణ ని దర్శకత్వం వహించిన మని కోరాడట. మనవడి సినిమా కావటం తో కృష్ణ కూడా వెంటనే ఓకె చెప్పి ఒక్ సీన్ ను డైరెక్ట్ చేసినట్టుగా వెల్లడించారు చిత్ర యూనిట్. గతం లో కృష్ణ.. సింహాసనం, బాల చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమా లకు దర్శకత్వం వహించాడు ఇన్నేళ్ల తరువాత ఇపుడు మరో సారి మెగా ఫోన్ పట్టుకున్నాడు సూపర్ స్టార్.