సన్నీలియోన్ అశ్లీల చిత్రాలు వదిలేసిన తర్వాత సన్నీలియోన్ బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. రొమాంటిక్ పాత్రలు, గ్లామర్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 

సన్నీలియోన్ భర్త డానియల్ వెబర్. ఆదివారం రోజు వెబర్ 41వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సన్నీలియోన్ తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. డానియల్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. 

తన భర్తని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనమిద్దరం కలసి చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మనమిద్దరం ఇంతలా ప్రేమలో ఉండడం నేను నమ్మలేకపోతున్నా. అందం, తెలివి, ధైర్యం అన్ని ఉన్న ధీరుడివి నువ్వు. అంతకు మించి గొప్ప భర్తవి. ప్రియమైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా అని సన్నీలియోన్ పోస్ట్ చేసింది. 

సన్నీలియోన్, వెబర్ దంపతులు సరోగసి పద్ధతోలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. అలాగే సన్నీలియోన్ మరో పాపని దత్తత తీసుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలసి వెబర్ తన బర్త్ డేని జరుపుకున్నాడు.