సైరా సినిమాతో గత ఏడాది ఊహించని రిజల్ట్ ఐ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

అయితే కొరటాల ప్రాజెక్ట్ తరువాత మెగాస్టార్ ఏ సినిమా చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తండ్రి కోసం లూసిఫర్ హక్కుల్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆ సినిమాని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తేవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.  అయితే ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కూడా ఒక చేయి వేయనున్నట్లు టాక్ వస్తోంది.

సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తాడా లేదా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. కానీ సుకుమార్ మాత్రం ఆ కథలో తనదైన శైలిలో మార్పులు తీసుకువచ్చి మెగాస్టార్ కి హెల్ప్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ కూడా కొరటాల ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలు ఒక కొలిక్కి రాగానే సుక్కు -మెగాస్టార్ కాంబో పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే కొరటాల శివతో చిరు చేస్తున్న సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై గతకొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆచార్య సినిమా దసరా సెలవుల్లో రాబోతున్నట్లు సమాచారం. హాలిడేస్ మొదలుకాబోయే ఒక రోజు ముందే సినిమాని రిలీజ్ చేయాలనీ మెగాస్టార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.