సాధారణంగా ఇంట్లో పిల్లలు పోర్న్ చూస్తున్నారని తెలిస్తేనే వెంటనే కట్టడి చేస్తారు. అలాంటిది తన కుమార్తె అడల్ట్ ఎంటర్టైన్మెంట్  ఫీల్డ్ లో కి దిగబోతున్నానని, ఫోర్న్ స్టార్ అవుతానని చెప్తే ఏ తండ్రి అయినా ఏం చేస్తారు. మిగతా వాళ్ల సంగతేమో కానీ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మాత్రం తన కుమార్తె ఆలోచనను,తీసుకున్న నిర్ణయాన్ని సమర్దించారు. ఆమె సొంతంగా సెక్స్ వర్కర్ గా మారి,వీడియోలు నిర్మిస్తానంటే ఛలో ..నీ ఇష్టం అనేసాడు.

ఇప్పుడీ విషయమే అంతటా సంచలనంగా మారింది. ఈటి,  జాస్, ఇండియానా జోన్స్, జురాసిక్  పార్క్, షిండ్లర్స్ లిస్ట్ వంటి మరెన్నో ఘనవిజయం సాధించిన సినిమాలు తీసిన ప్రముఖ హలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్.   మైకియల్ స్పీల్ బర్గ్... దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కు ఏడవ సంతానం. ఆమె వయస్సు 23, రీసెంట్ గా సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తాను సోలోగా అడల్ట్ వీడియోలు నిర్మిచబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తన తండ్రి తన నిర్ణయానికి అడ్డు పెట్టలేదని చెప్పుకొచ్చింది.

ఇప్పటికే తాను ఈ విషయమై సెక్స్ వర్కర్ గా మారటానికి అప్లికేషన్ సబ్ మిట్ చేసానని అంది.   ఈ నిర్ణయం తాను ప్రకటించగానే తన పేరెంట్స్ అప్ సెట్ అవుతారేమో అని భయపడ్డాను కానీ వారు,నా నిర్ణయాన్ని సపోర్ట్ చేయటం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. తను చేసే సోలో ఫోర్న్ ఫిల్మ్ తనకు మానసిక శాంతిని ఇస్తుందని, చాలా ఏళ్లుగా పోరాడుతున్న ఆల్కహాల్ సేవనం, హెల్త్ ఇష్యూల నుంచి రిలీఫ్ ఇచ్చిందని అంది.

ఈ విషయంపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. "స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క సొంత కుమార్తె ఒక పోర్న్ స్టార్ కావడం మరియు స్పీల్బెర్గ్ తన కూతురి యొక్క నిర్ణయానికి మద్దతు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రపంచం నిజంగా అభివృద్ధి చెందుతోంది" అని వర్మ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు