కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పెద్ద చిన్నా పేద ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను ఈ వైరస్‌ పట్టి పీడిస్తోంది. రాజులు, దేశాధ్యక్షులు కూడా మహహ్మారి బారిన పడ్డారు. సెలబ్రిటీ సినీ తారలకు కూడా ఈ వైరస్ సోకింది. తాజాగా ఈ వైరస్‌ భారిన పడి ఓ సీనియర్ నటుడు మరణించాడు. స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా కారణంగా మృతి చెందాడు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలటంతో సర్రేలోని హాస్పిటల్‌ చేరారు.

ఆ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ఆయన పర్సనలఖ పీఆర్వో జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా వెల్లడించారు. జాక్‌ వయసు 76 ఏళ్లు.  స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. జాక్ కేవలం నటుడు మాత్రమే కాదు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌ లాంటి వారికి డైలాగ్ డెలివరీ విషయంలో సాయం చేస్తుంటాడు.

ప్రస్తుతం ఆయన భార్య గేబ్రియల్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. జాక్  మరణ వార్త విన్న ఆమె రెండు రోజుల క్రితం జాక్ కు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. మంగళవారం ఆయన ఎలాంటి బాధ లేకుండా ప్రశాంతంగా కన్నుమూశారు` అంటూ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల మందికిపైగా కరోనా వైరస్‌ సోకింది. దాదాపు 40 వేల మందికి పైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు.