ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని రూపొందించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక లేదా పూజా హెగ్డేలను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ మూడో సారి పూజాని రిపీట్ చేయబోతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ సమంత దక్కించుకుందని సమాచారం.

లీక్ : అనసూయ అయితే పది లక్షలే.. అదేనా అసలు కారణం?

త్రివిక్రమ్ రూపొందించిన  'అత్తారింటికి దారేది', 'సన్ అఫ్ సత్యమూర్తి', 'అఆ' వంటి చిత్రాల్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. అలానే ఎన్టీఆర్ తో కలిసి  సమంత  'బృందావనం', 'రామయ్య వస్తావయ్యా', 'జనతా గ్యారేజ్' వంటి చిత్రాల్లో నటించింది. వీరి కాంబోలో సినిమా అంటే అంచనాలు పెరగడం ఖాయం.

సమంత ఎంపికపై అధికార ప్రకటన రానప్పటికీ దాదాపు ఆమె ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు. ఈ సినిమా చేసిన తరువాత నటిగా కొంత గ్యాప్ తీసుకోవాలని సమంత భావిస్తోంది. ఈ విషయాన్ని సమంత కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రెండేళ్లపాటు గ్యాప్ తీసుకొని నటిగా కాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం కంటిన్యూ అవుతానని తెలిపింది.