సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్స్ బహిరంగంగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. అయితే దాదాపు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు మాత్రమే ఈ విషయంపై పెదవి విప్పారు. స్టార్ హీరోయిన్లు మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీలపై మీటూ ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆ విషయంపై స్పందించిన రకుల్ తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను ఎంతో బాగా చూసుకున్నారని కామెంట్స్ చేసింది.

పూజా హెగ్డే ఓర చూపులు.. కుర్రాళ్ల మతిపోగొడుతోంది!

ఆ సమయంలో శ్రీరెడ్డి.. రకుల్ ని ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేసింది కానీ రకుల్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా రకుల్ మీటూ కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఓ అనుభవం గురించి వివరించింది.

కాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు ఎదురు కాలేదని అబద్దం చెప్పనని.. గతంలో ఓ స్టార్ హీరో సెక్స్ కోసం తనను అడిగాడని సంచలన విషయాన్ని బయటపెట్టింది. తన ముందు ఆ స్టార్ హీరో సెక్స్ ప్రపోజల్ పెట్టాడని.. అయితే మరీ అసభ్యకరంగా కాకుండా.. చాలా మర్యాదపూర్వకంగానే ఆ ప్రపోజల్  తీసుకొచ్చాడని తెలిపింది.

అతడి మాటలు వినగానే కోపం వచ్చిందని.. నా దగ్గర అలాంటివి కుదరవని కూల్ గా అతడికి సమాధానం ఇచ్చానని రకుల్ తెలిపింది. అలా అడిగిన స్టార్ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం రకుల్ బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో ఓ సినిమా, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది.